Silver, Gold price increase| ఆగని వెండి..బంగారం పరుగు

వెండి, బంగారం ధరలలో భారీ పెరుగుదల కొనసాగుతుంది. మంగళవారం వెండి కిలో ధర ఒక్కసారిగా రూ.3,000పెరిగి రూ.2,34,000కు చేరింది. 10రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర రూ.24వేలు పెరుగగా..మూడురోజుల్లోనే రూ.13వేలు పెరిగింది.

విధాత : వెండి, బంగారం ధరల (Silver, Gold price increase)లో భారీ పెరుగుదల కొనసాగుతుంది. మంగళవారం వెండి కిలో ధర ఒక్కసారిగా రూ.3,000పెరిగి రూ.2,34,000కు చేరింది. 10రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర రూ.24వేలు పెరుగగా..మూడురోజుల్లోనే రూ.13వేలు పెరిగింది. వెండి ధరల దూకుడు చూస్తే కొత్త సంవత్సరం ఆరంభంలోనే రూ.2,50,000లకు చేరవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో వెండిపై పెరుగుతున్న పెట్టుబడులు, ఉత్పత్తిలో తగ్గుదల, డాలర్ల హెచ్చుతగ్గులు, ఎలక్ట్రానిక్స్ లో వెండి వినియోగానికి పెరిగిన డిమాండ్ వెండి ధరల పెరుగుదలకు కారణంగా కనిపిస్తున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

రూ.2,400పెరిగిన బంగారం

మరోవైపు బంగారం ధరలు కూడా తగ్గేదేలే అన్నట్లుగా పైపైకి వెలుతున్నాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర మంగళవారం ఒక్కసారిగా రూ.2,400పెరిగి..రూ.1,38,550కి చేరింది. 22క్యారెట్ల 10గ్రాముల ధర రూ.2,200పెరిగి రూ.1,27,000పెరిగింది.

Latest News