WhatsApp | ఫైల్‌ షేరింగ్‌ మరింత ఈజీ..! త్వరలో సరికొత్త ఫీచర్‌ను తేనున్న వాట్సాప్‌..!

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. యాప్‌కి మొత్తం మూడు బిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. ఏటా యూజర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసిన మెటా కంపెనీ.. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది.

  • Publish Date - April 24, 2024 / 01:30 PM IST

WhatsApp | ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగిస్తున్న ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ ఒకటి. యాప్‌కి మొత్తం మూడు బిలియన్లకుపైగా యూజర్లు ఉన్నారు. ఏటా యూజర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ క్రమంలో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్నది. ఇప్పటికే ఎన్నో ఫీచర్లను యూజర్లకు పరిచయం చేసిన మెటా కంపెనీ.. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమైంది. యూజర్లు ఇంట‌ర్నెట్ అందుబాటులో లేకపోయినా ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను షేర్‌ చేసుకునేలా ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. ఈ ఫీచ‌ర్ క‌నుక అందుబాటులోకి వ‌స్తే నెట్‌వ‌ర్క్‌తో సంబంధం లేకుండా ఫైల్స్‌ను పంపుకునే వెసులుబాటు కలుగనున్నది. ప్రస్తుతం అందరూ ఇంటర్‌నెట్‌ లేకపోతే బ్లూటూత్, క్వీక్ షేర్‌, నియ‌ర్ బై షేర్‌, షేర్ఇట్ అప్లికేషన్లతో డేటాను ట్రాన్స్‌ఫర్‌ చేసుకుంటూ వస్తున్నారు.

తాజాగా ఇదే తరహాలోనే వాట్సాప్‌ సైతం ఫీచర్‌ను తీసుకురాబోతున్నది. దాంతో ఫైల్స్‌ను వేగంగా.. సురక్షితంగా పంపేందుకు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడనున్నది. ఈ ఫీచ‌ర్‌ను ఎనేబ‌ల్ చేసుకోవాలంటే మాత్రం వాట్సాప్ సిస్టమ్ ఫైల్‌, ఫొటోల గ్యాల‌రీ యాక్సెస్ తదితర పర్మిషన్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు పంపించాల‌నుకుంటున్న వ్యక్తి మొబైల్ బ్లూటూత్ క‌నెక్ట్ అయ్యేంత ద‌గ్గర‌లో ఉంటేనే ఆఫ్‌లైన్ షేరింగ్‌కు వీల‌వుతుంది. బ్లూటూత్ ఆన్ చేసి ద‌గ్గర‌లోని వాట్సాప్ యూజ‌ర్ ప‌రిక‌రాన్ని గుర్తించి డాక్యుమెంట్ సెండ్ చేస్తే సరిపోతుంది. ఇక అవ‌త‌లి వ్యక్తి ప‌ర్మిష‌న్ ఇస్తేనే ఈ త‌ర‌హా షేరింగ్ సాధ్యమ‌వుతుంది. వాట్సాప్ ద్వారా వివిధ ర‌కాల ఫైల్స్‌ను పంప‌డాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకే ఈ ఫీచ‌ర్‌ను తీసుకువ‌చ్చేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ మేర‌కు వాట్సాప్‌ అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ త‌న బ్లాగ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉన్నది. బీటా యూజర్లకు అందుబాటులో ఉండగా.. విజయవంతమైతే త్వరలోనే యూజర్లందరికీ పరిచయం చేయనున్నది.

Latest News