WhatsApp | ఈ ఫోన్స్‌కు వాట్సాప్‌ సర్వీసులు నిలిపివేత.. లిస్ట్‌లో 35 మోడల్స్‌.. మరీ ఈ ఫోన్‌ ఉందా? చెక్‌ చేసుకోండి..!

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. అదే సమయంలో సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తున్నది. ఈ క్రమంలో పాత మోడల్స్‌కు సర్వీసులను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మోడల్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు వాట్సాప్‌ సేలను నిలిపివేస్తున్నట్లు వెల్డించింది.

  • Publish Date - June 27, 2024 / 09:52 AM IST

WhatsApp | ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను తీసుకువస్తున్నది. అదే సమయంలో సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తున్నది. ఈ క్రమంలో పాత మోడల్స్‌కు సర్వీసులను నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని మోడల్స్‌ స్మార్ట్‌ఫోన్స్‌కు వాట్సాప్‌ సేలను నిలిపివేస్తున్నట్లు వెల్డించింది. రాబోయే రోజుల్లో కొన్ని మోడల్స్‌పై సేవలను పని చేయవచని పేర్కొంది. ఈ మేరకు ఆయా మోడల్స్‌ జాబితాను జాబితాను కెనాల్‌టెక్ సంస్థ విడుదల చేసింది. ప్రముఖ బ్రాండ్లకు చెందిన 35 రకాల మోడళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో శాంసంగ్‌ కంపెనీ నుంచి గెలాక్సీ ఏస్ ప్లస్, గెలాక్సీ కోర్, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్ 2, గెలాక్సీ గ్రాండ్, గెలాక్సీ నోట్ 3, గాలాక్సీ ఎస్3 మినీ, గెలాక్సీ ఎస్ 4 యాక్టివ్, గెలాక్సీ ఎస్4 మినీ, గెలాక్సీ ఎస్ 4 జూమ్ ఉన్నాయి.

ఇక మోటరోలా కంపెనీ నుంచి మోటో జీ, మోటో ఎక్స్ మోడల్స్‌లో ఉన్నాయి. ఇక ఐఫోన్‌ 5, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్, ఐఫోన్ 6 ఎస్ ప్లస్, ఐఫోన్ ఎస్ఈ మొబైల్స్‌లో వాట్సాప్‌ పని చేయదని పేర్కొంది. హువావే నుంచి ఎసెండ్ పీ6 ఎస్, ఎసెండ్ జీ525, హువావే సీ199, హువావే జీఎక్స్1ఎస్, హువావే వై625, లెనోవా కంపెనీ నుంచి లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్890 మోడల్స్‌ ఉన్నాయి. సోనీ నుంచి ఎక్స్‌పీరియా జీ1, ఎక్స్‌పీరియా ఈ3, ఎల్‌జీ ఆప్టిమస్ 4ఎక్స్ హెచ్‌డీ, ఆప్టిమస్ జీ, ఆప్టిమస్ జీ ప్రో, ఆప్టిమస్ ఎల్7 మోడల్స్‌లో వాట్సాప్‌ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. రాబోయే కొద్దిరోజుల్లోనే వాట్సాప్‌ సర్వీసులను నిలిపివేస్తుందని.. ఈ మోడల్స్ ఫోన్స్‌ వినియోగించే వారంతా అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని సూచించింది.

Latest News