12A Railway Colony – Trailer : ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్ విడుదల

అల్లరి నరేష్ నటించిన ‘12ఏ రైల్వే కాలనీ’ ట్రైలర్ విడుదలైంది. హర్రర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

12A Railway Colony - Trailer

విధాత : హాస్యభరిత చిత్రాలతో మెప్పించిన అల్లరి నరేష్ హీరోగా రూపొందిన ‘12ఏ రైల్వే కాలనీ’ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే ఈసారి నరేష్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లర్ కథ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ చుట్టు సాగే థ్రిల్లర్ కథగా ‘12ఏ రైల్వే కాలనీ’ సినిమా తెరకెక్కినట్లుగా ట్రైలర్ లోని సన్నివేశాలు కనిపించాయి. ‘పొలిమేర చిత్రాల దర్శకుడు అనిల్‌ విశ్వనాథ్‌ అందించిన కథతో నాని కాసరగడ్డ తెరకెక్కించిన ‘12ఏ రైల్వే కాలనీ’ మూవీలో హీరోయిన్ గా కామాక్షి భాస్కర్ల హీరోయిన్.

సాయి కుమార్‌, గెట‌ప్ శ్రీను, అవిష్ కురువిల్లా, వైవ హ‌ర్ష ప్ర‌ధాన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. భీమ్స్ సిసీరిలియోసంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. హాస్య చిత్రాల నుంచి ట్రాక్ మార్చి ఉగ్రం, బచ్చలమల్లి చిత్రాలతో మాస్ హీరోగా ప్రయోగాలు చేసి విఫలమైన అల్లరి నరేష్.. మరోసారి సస్పెన్స్ థ్రిల్లర్ ‘12ఏ రైల్వే కాలనీ’తో విజయం కోసం ప్రయత్నిస్తుండటం విశేషం.