Bhartha Mahasayulaku Wignyapthi Glimpse : రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్లింప్స్ విడుదల

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ గ్లింప్స్ విడుదలైంది. భార్యభర్తల సంబంధాలపై హాస్యభరితంగా సాగిన ఈ వీడియో ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది.

Bhartha Mahasayulaku Wignyapthi

విధాత : రవితేజ కొత్త సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి మేకర్స్ గ్లింప్స్ విడుదల చేశారు. దర్శకుడు కిశోర్‌ తిరుమల RT76 వర్కింగ్‌ టైటిల్‌తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ మూవీ టైటిల్ కు తగ్గట్టుగానే భార్య బాధితుడి భర్త కథను చాటుతూ హాస్యభరితంగా సాగింది. హీరో రవితేజ పాత్ర డైలాగ్ లు…నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు..నన్ను రెండు ప్రశ్నలు అడిగారు..సమాధానాల కోసం గూగుల్, చాట్ జీపీటీ, జెమినీని అడిగాను.. వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేశాయని..చివరకు పెళ్లయిన మొగుళ్లను కూడా అడిగానని..వారు ఆశ్చర్యపోయారే తప్పా సమాధానం ఇవ్వలేదంటూ సాగాయి. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడాళ్లు అడక్కూడదని, పెళ్లయిన వారికి నాలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదని కోరుకుంటూ..మీ ఈ రామ సత్యనారాయణ చెప్పేదేమిటంటే..భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ ఆసక్తికరంగా ఉన్నాయి.

రవితేజ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 76వ చిత్రంగా వరుస షెడ్యూల్స్తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయాతి హీరోయిన్లు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ప్రసాద్ మురెల్లా సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. మాస్‌ జాతర మూవీతో ఇటీవల ప్రేక్షకులకు ముందుకు వచ్చిన రవితేజ మరో ఫెయిల్యూర్ తన ఖాతాలో వేసుకున్నప్పటికి జయపజయాలతో సంబంధం లేకుండా ఈ సినిమాతో బిజీ అయ్యారు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కథనం చూస్తే ఈ సినిమా హిట్ కొట్టేలా కనిపిస్తుందంటున్నారు అభిమానులు.