Site icon vidhaatha

Hema| హేమ రేవ్ పార్టీలో పాల్గొందని వ‌చ్చిన వార్త‌లు నిజ‌మే.. బ‌య‌ట‌కు వ‌చ్చిన సాక్ష్యాలు

Hema| బెంగళూరు నగర శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన రేవ్‌పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం అందులో టాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ సినీ సెల‌బ్రిటీలు కూడా ఉండ‌డ‌మే. ముఖ్యంగా న‌టి హేమ వ్య‌వ‌హారం ఇక్క‌డ చర్చ‌నీయాంశంగా మారింది. పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొంది అని చెప్పిన కూడా ఆమె తాను అక్క‌డ లేన‌ని ఏవేవో వీడియోలు రిలీజ్ చేసి జ‌నాల‌ని క‌న్ఫ్యూజ్ చేసింది. అయితే రీసెంట్‌గా రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ గా వ‌చ్చిన‌ట్టు పోలీసులు తెలియ‌జేశారు. పట్టుబడిన వారిలో 59 మంది పురుషుల రక్త నమూనాల్లో డ్రగ్స్‌ ఆనవాళ్ళు ఉండ‌గా, 27 మంది మహిళల రక్త నమూనాల్లో కూడా కనిపించిన‌ట్టు తెలిపారు. అయితే డ్రగ్స్‌ తీసుకున్నవాళ్లను బాధితులుగా పరిగణించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయని పోలీసులు తెలుపుతున్నారు.

అయితే హేమ డ్ర‌గ్స్ కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉంది. పార్టీకి వెళ్తున్న క్రమంలో తన పేరు బయటికి రాకుండా అనేక జాగ్ర‌త్త‌లు తీసుకుంది.. తన అసలు పేరుకు బదులుగా కృష్ణవేణి పేరుతో పార్టీకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకి నోటీసులు పంపి విచారించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక హేమతో పాటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీకి చెందిన చిరంజీవి, ఆశి రాయికి కూడా బెంగుళూరు సీసీబి పోలీసులు నోటిసులు ఇవ్వనున్నారు. అయితే రేవ్ పార్టీలో తాను పాల్గొన‌లేద‌ని నిరూపించేందుకు హేమ స‌ర్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంది. కాని అవ‌న్నీ బెడిసికొడుతున్నాయి.

బెంగళూర్ రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నారని నిరూపించేందుకు ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ క‌చ్చిత‌మైన ఆధారాన్ని బ‌య‌ట‌పెట్టింది. హేమ ప్ర‌యాణించిన ఫ్లైట్ టికెట్ కాపీ తమ వద్ద ఉన్నట్లుగా చెప్పుకొచ్చిన మీడియా సంస్థ అందులో హేమ మే 18న (శనివారం) రోజున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లారని చెప్పుకొచ్చారు. మధ్యాహ్నం 1.55 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు వెళ్లిన విమానంలో హేమ ఉన్నారని వారు తెలియ‌జేశారు. శనివారం మధ్యాహ్నం 3.15 గంటలకు హేమ బెంగళూరు చేరుకోగా, అక్కడి నుంచి పార్టీ జరిగిన రిసార్ట్‌కు హేమ అండ్ కో వెళ్లినట్లు తెలిపింది. ఇండిగో 6ఈ- 6305 విమానంలో హేమతో పాటు కాంతి, రాజశేఖర్, తదితరులు ఉన్నారని కూడా స‌ద‌రు మీడియా సంస్థ తెలియ‌జేసింది.

Readmore

Bangalore Rave Party | రేవ్ పార్టీలో నటి హేమ…బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ

Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ

Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ‌.. ఫోటో విడుద‌ల చేసిన బెంగ‌ళూరు పోలీసులు

“రేవ్​ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”

Bangalore Rave Party | బెంగుళూర్‌ రేవ్‌ పార్టీలో 86 మందికి డ్రగ్‌ టెస్టులో పాజిటీవ్‌.. వారికి నోటీస్‌లు

Exit mobile version