Site icon vidhaatha

Bangalore Rave Party | రేవ్ పార్టీలో నటి హేమ…బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

తెలుగు సినీజనాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు హేమ. కారెక్టర్​ ఆర్టిస్ట్​గా వందలాది తెలుగు సినిమాల్లో నటించింది. హీరోయిన్ ఫ్రెండ్​గా, నలుగురిలో ఒకరిగా కనిపించి క్రమంగా హాస్యనటిగా, అక్కగా, వదినగా ఎదిగి, ఇప్పుడు అమ్మగా, అత్తగా సెటిలయింది Character Artist Hema

కృష్ణవేణీ సయ్యద్​… ఇలా అంటే ఎవరికీ తెలియదు. హేమా ఆంటీ అంటే మాత్రం కుర్రకారుకు బాగా తెలుసు. ఇలా బాగా పాపులర్​ అయిన హేమ అసలు పేరు కృష్ణవేణి. సొంతవూరు తూర్పు గోదావరి జిల్లా రాజోలు(Rajolu). వయసు 56 ఏళ్లు. చిన్నప్పటి నుండి నటి కావాలని కలలు కన్న కృష్ణవేణి, మద్రాస్​ వెళ్లి డాన్స్​ నేర్చుకుని  మొత్తానికి ఆ కల నెరవేర్చుకుంది. ప్రేమించిన జాన్​ సయ్యద్​(Jan Syed) అనే అతన్ని వివాహం చేసుకుంది. తనకు ఒక కూతురు ఇషా. కారెక్టర్​ ఆర్టిస్ట్​గా చాలా మంచి, గుర్తుండే పాత్రలు చేసింది హేమ. ముఖ్యంగా పాపులర్​ కమెడియన్లయిన బ్రహ్మానందం, ఎంఎస్​ నారాయణ, ధర్మవరపు సుబ్రమణ్యం లాంటి వారితో ఎక్కువ కాంబినేషన్లు చేసింది.

బాలకృష్ణ నాయకుడిగా నటించిన భలేదొంగ(Bhale Donga) సినిమాతో రంగప్రవేశం చేసిన హేమ దాదాపు 500కు పైగా చిత్రాలలో నటించింది. ఓ నాలుగు టీవీ సీరియళ్లలో కూడా నటించింది. 2009లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి గానూ, ఉత్తమ హాస్యనటిగా నంది అవార్డు(Nandi Award) గెలుచుకుంది. బిగ్​బాస్​ (BIGGBOSS)షోలో కూడా పాల్గొంది.

సినిమాల్లో రాణించిన హేమకు స్వతహాగా రాజకీయాలంటే మక్కువ ఎక్కువ. అందుకే సినీ రాజకీయాల్లో కూడా ప్రవేశించి, మా(మూవీ ఆర్టిస్ట్స్​​ అసోసియేషన్​-MAA)లో కార్యవర్గ సభ్యురాలిగా, సంయుక్త కార్యదర్శిగా ఎంపికయింది. ఏ ప్యానెల్​లో లేకుండా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి కూడా గెలుపొందింది. ఆ తర్వాత అసలైన రాజకీయాలలోకి 2014లో ప్రవేశించి, సమైక్యాంధ్ర పార్టీ తరపున మండపేట (Mandapet)శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయింది. ఇక అక్కన్నుంచి వైఎస్సార్సీపీకి 2019లో, మళ్లీ అక్కన్నుంచి 2021లో బిజేపీలోకి జంప్​ చేసింది. ప్రస్తుతం బిజేపీలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

హేమ నటిగా సంపాదించిన పేరు కంటే వివాదాస్పదురాలిగా సంపాదించిందే ఎక్కువ. చాలా పెద్ద నోరని సినీ జనాల్లో బాగా పేరు. ఎవరూ తన జోలికి పోయి అనవసరంగా తిట్లు పడరని జర్నలిస్టుల లోపలి మాట. ఇవాళ తను ఈ బెంగళూరు రేవ్​ పార్టీలో దొరికినా, ఇటువంటివేవీ తనకు కొత్త కాదని, ఇంతకంటే గొప్ప పనులే చేసిందని నటి కళ్యాణి ఆరోపించింది. తెలుగు సినీ పరిశ్రమ పరువు తీసిందని వాపోయింది.

Readmore

Karate Kalyani | టాలీవుడ్ పరువు తీసిన హేమ: కరాటే కల్యాణీ

Bangalore Rave Party | బెంగుళూర్ రేవ్ పార్టీ కేసు ఎప్పుగూడ పీఎస్‌కు బదిలీ

Srikanth| ఏంటి… హీరో శ్రీకాంత్ కూడా రేవ్ పార్టీలో దొరికాడా..!

Hema| బెంగ‌ళూరు రేవ్ పార్టీలో హేమ‌.. ఫోటో విడుద‌ల చేసిన బెంగ‌ళూరు పోలీసులు

“రేవ్​ పార్టీలో ఉన్నది తెలుగు నటి హేమనే”

Exit mobile version