నటి హేమ, అషిరాయ్‌లకు పాజిటీవ్
విధాత : బెంగుళూర్ ఎలక్ట్రానిక్ సిటీలో సన్ సెట్ టు సన్ రైజ్ పరుతో వాసు నిర్వహించిన బర్త్ డే రేవ్ పార్టీలో పాల్గొన్న వారిలో 106మందికి డ్రగ్ టెస్టుల్లో పాజిటీవ్‌గా తేలినట్లుగా పోలీసులు వెల్లడించారు. రేవ్ పార్టీలో 150మంది పాల్గొనగా, 106మంది నుంచి రక్తనమూనాలను సేకరించి నార్కోటిక్ టెస్టులకు పంపిగా వారిలో పాజిటీవ్‌గా తేలిన 86మందికి త్వరలోనే బెంగుళూర్ పోలీసులు నోటీస్‌లు ఇవ్వనున్నారు. వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. పాజిటీవ్‌గా నిర్ధారణ అయిన తెలుగు నటి హేమ, అషిరాయ్, హేమ స్నేహితుడు చిరంజీవి, నిర్వాహకుడు వాసులకు కూడా కౌన్సిలింగ్‌కు పిలువనున్నారు. నటి హేమ ఈ రేవ్ పార్టీలో కృష్ణ వేణి పేరుతో పార్టీకి హాజరైనట్లుగా పోలీసు రికార్డులో పేర్కోన్నారు. మొత్తం 59మంది పురుషులలో, 27మంది మహిళల్లో డ్రగ్ పాజిటీవ్‌గా తేలింది.
బెంగుళూర్ రేవ్ పార్టీలో పాజిటీవ్ వ్యక్తులకు నోటీస్‌లు
బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో సీసీబీ పోలీసులు డ్రగ్స్ టెస్టు పాజిటీవ్ వచ్చిన వ్యక్తులకు నోటీస్‌లు జారీ చేశారు. హెబ్బగుడి పోలీస్ స్టేషన్‌లో వారిని విచారిస్తున్నారు. ఈ కేసులో నటి హేమతో పాటు అషిరాయ్‌లకు నోటీస్‌లు పంపించారు. కేసులో ఏ1గా వాసు, ఏ2గా అరుణ్‌కుమార్‌రెడ్డి, ఏ3గా నాగబాబు, ఏ4గా రణధీర్‌బాబు, ఏ5గా అబుబాకర్, ఏ6గా గోపాల్‌రెడ్డి, ఏ7గా 68మంది యువకులు, ఏ8గా 30మంది యువతుల పేర్లను పొందుపరిచారు.