Arjun Chakravarthy | విధాత : విజయ్ రామరాజు( Vijay Ramaraju) ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ చక్రవర్తి’(Arjun Chakravarthy) సినిమా నుంచి గురువారం విడుదలైన ట్రైలర్ సినిమాపై అమాంతంగా అంచనాలు పెంచేసింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరో పాత్రలో విజయ్ రామరాజు తన ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. ‘ఖాళీ చేతులతో, కాలే కడుపుతో చేసేదే అసలైన యుద్ధం’ అంటూ పంచ్ డైలాగ్ లతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.
ఓ కబడ్డీ ఆటగాడి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకున్న‘అర్జున్ చక్రవర్తి’ సినిమాలో కబడ్డీ ఆట సన్నివేశాలు..కథలో మలుపులు..కథానాయకుడి ప్రేమసన్నివేశాల ట్రైలర్ లో ఆకట్టుకున్నాయి. పేదరికం నుంచి జాతీయ స్థాయి కబడ్డీ ఆటగాడి ఎదిగిన వ్యక్తి..తాగుబోతుగా ఎందుకు మారాడు..మళ్లీ దేశం కోసం ఎలా కబడ్డీలో విజేతగా నిలిచాడన్నదే సినిమా కథగా కనిపిస్తుంది. ఈ నెల 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి…
Nizamabad : పది రూపాయలకే ప్యాంట్-షర్ట్ ఆఫర్ కోసం ఎగబడ్డ జనం..యజమాని అరెస్టు!
Mega Update | చిరంజీవి నోట విశ్వంభర మాట : 2026కు తరలిన విడుదల