Site icon vidhaatha

Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ గ్లింప్స్ అదుర్స్!

chiranjeevi-vishwambhara-glimpse-release

Vishwambhara | విధాత : మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు వశిష్ట రూపొందించిన సోషియో ఫాంటసీ విశ్వంభర సినిమా నుంచి మేకర్స్ గురువారం గ్లింప్స్ రిలీజ్ చేశారు. చిరంజీవి రేపు తన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా, ఆయన అభిమానులకు ‘విశ్వంభర’ టీం మంచి సర్ప్రైజ్ ఇచ్చింది. విశ్వంభర గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, ఒక గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తున్నామన్నట్లుగా విజువల్ వండర్ గా కనిపించింది. గ్లింప్స్ ఒక బాలుడు, వృద్ధుడి మధ్య జరిగే ఆకర్షణీయ సంభాషణతో ప్రారంభమవుతుంది. ఒక్కడి స్వార్థం యుద్దంగా మారి..అంతులేని భయాన్నిచ్చింది…అంతకు మించిన మరణాన్ని రాసింది..ఆలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు ఒకడొస్తాడు..ఆగని యుద్దాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా ముగిస్తాడని గొప్పగా ఎదురుచూస్తుంది..ఎవరతను..అంటూ ప్రశ్నతో చిరంజీని గ్రాండ్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. గ్లింప్స్ సినిమా కథతో ముడిపడిన సంభాషణాలతో సాగి సినిమాపై అంచనాలను పెంచింది.

దర్శకుడు వశిష్ట విశ్వంభర ప్రపంచాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దినట్లుగా కనబడుతుంది. ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్, సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడు ఫాంటసీ లోకాన్ని అద్భుతమైన విజువల్స్‌తో జీవం పోశారు. వీఎఫ్‌ఎక్స్ పనితనం, యూవీ క్రియేషన్స్ భారీ నిర్మాణ విలువలను గ్లింప్స్ ప్రతిబింబించింది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి స్వరపరిచిన నేపథ్య సంగీతం, గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ‘విశ్వంభర’ చిరంజీవి కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవనుందని ఈ గ్లింప్స్ చాటుతుంది. విశ్వంభర సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ల సమర్పణలో భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తుండగా, అశిక రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
చిరంజీవి ఇప్పటికే ప్రకటించినట్లుగా, ‘విశ్వంభర’ 2026 వేసవిలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి…
Delhi CM Rekha Gupta| ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి!
ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. కాంగ్రెస్ ఎంపీల పోరాటం!

Exit mobile version