విధాత, హైదరాబాద్ : తెలంగాణ ఎదుర్కొంటున్న యూరియా కొరత సమస్యను పరిష్కరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేసిన ఒత్తిడి..కాంగ్రెస్ ఎంపీల పోరాటం ఫలించింది. తక్షణమే 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపునకు కేంద్రం హామీ ఇచ్చింది. గుజరాత్, కర్ణాటక నుంచి తక్షణమే తెలంగాణకు యూరియా తరలించాలని ఆదేశాలిచ్చింది. కేంద్రం స్పందన నేపథ్యంలో ఇటు వారం రోజుల్లో తెలంగాణకు యూరియా వస్తుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో రెండు రోజులుగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్రం తెలంగాణకు 8 లక్షల టన్నుల యూరియా ఇస్తామని చెప్పి, కేవలం 5 లక్షల 32 వేల టన్నులు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇంకా సుమారు 3 లక్షల టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, ఈ కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఫలించిన తెలంగాణ ప్రభుత్వ ఒత్తిడి.. కాంగ్రెస్ ఎంపీల పోరాటం!
