Kangana Ranaut| బాలీవుడ్ హాట్ బాంబ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. లేడీ ఒరియంటెడ్ మూవీస్‌తో స్టార్ హీరో మూవీస్‌కు దీటుగా కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో కూడా ఈ అమ్మడు పలు సినిమాలు చేసి అలరించింది. అయితే కెరీర్ సజావుగానే సాగుతున్న సమయంలో కంగనా ఊహించని విధంగా రాజకీయాలలోకి వెళ్లింది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయింది. లోక్‌సభ ఎన్నికలు-2024లో పోటీ చేసి గెలిచింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. 71 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గింది. కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ ఆమె చేతిలో చిత్తుగా ఓడారు. అయితే ఎంపీగా గెలిచిన తర్వాత కంగనాకి ఊహించని పరిస్థితి ఎదురైంది.
శుక్రవారం జరగనున్న ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు కంగనా రనౌత్ ఢిల్లీకి వెళుతుండగా, ఆమెకి చంఢీఘడ్ ఎయిర్‌పోర్ట్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టులో విధుల్లో ఉన్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ తనను చెంపదెబ్బ కొట్టారని కంగనా రనౌత్ ఆరోపించడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. యూకే 707విమానంలో చండీగఢ్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి వెళ్లేందుకు కంగనా ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన సమయంలో బోర్డింగ్ పాయింట్‌కి వెళుతున్నప్పుడు పుల్వీందర్ కౌర్ అనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తనతో వాగ్వాదానికి దిగిందని కంగనా పేర్కొంది. ఆమె తన చెంపపై కొట్టిందంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు కంగనా.
రైతుల నిరసనలపై చేసిన వ్యాఖ్యల విషయంలో రైతులను ఉగ్రవాదులతో పోల్చడం వలన కుల్వీందర్ కౌర్ తనని చెంప పగలగొట్టిందని కంగనా పేర్కొంది. ఆందోళన చేస్తున్న రైతులను ఖలిస్థాని ఉగ్రవాదులతో కంగనా రనౌత్ పోల్చడం వల్లనే సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ మనస్థాపం చెంది ఆమెని కొట్టినట్టు తెలుస్తుంది. ఘటన తర్వాత చండీగఢ్ నుంచి విమానంలో ఢిల్లీకి చేరుకున్న కంగనా రనౌత్.. జరిగిన ఘటన మొత్తాన్ని సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ నీనా సింగ్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులకు వివరించారట. వారు కుల్విందర్ కౌర్‌ను అదుపులోకి తీసుకుని.. విచారణ కోసం సీఐఎస్ఎఫ్ కమాండెంట్ ఆఫీస్‌కు తరలించినట్టు సమాచారం.