- 9 మంది మహిళలు సహా 11 మంది దుర్మరణం
విధాత: తమిళనాడులో పటాకుల తయారీకి ప్రఖ్యాతిగాంచిన శివకాశిలో 2 పటాకుల రిటైల్ కేంద్రాల్లో ఘోర పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో 11 మంది కార్మికులు దుర్మరణం చెందారు. ఇందులో 9 మంది మహిళలు కూడా ఉన్నారు. శాంపిళ్లను పరీక్షించే క్రమంలో ఈ పేలుళ్లు సంభవించినట్టు ప్రాథమికంగా తెలుస్తున్నది.
ఈ రిటైల్ కేంద్రాలకు లైసెన్స్ ఉన్నదని అధికారులు చెబుతున్నారు. పేలుళ్లు సంభవించిన తీరుపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మూడు లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.