Site icon vidhaatha

Tamilnadu | బాణసంచా గోదాంలో పేలుడు.. ఎనిమిది మంది మృతి

Tamilnadu | విధాత: తమిళనాడులోని కృష్ణగిరి పాళయపేటలో బాణసంచా నిల్వ చేసిన గోదాంలో పేలుడు సంభవించి ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. పేలుడులో మరో 20మందికి గాయాలయ్యాయి.

జనావాసాల మధ్య ఉన్న ఈ గోదాంలో పేలుడుతో పరిసర ప్రాంతంలోని ఇండ్లు పేలుడు ధాటికి దెబ్బతిన్నాయి. వాటి శిధిలాల కింద కూడా మరికొందరు మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయ చర్యలను చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించి కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.

Exit mobile version