స్టాక్ మార్కెట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్ల అరెస్టు

ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.4 కోట్ల నగదు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు

  • Publish Date - January 6, 2024 / 02:46 PM IST

  • రూ.1.4 కోట్ల నగదు స్వాధీనం
  • దుబాయ్ వేదికగా ఆన్ లైన్ లావాదేవీలు
  • హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి

విధాత, హైదరాబాద్: ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.4 కోట్ల నగదు, ల్యాప్ టాప్ లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస రెడ్డి కేసు వివరాలు మీడియాకు వివరించారు. హైదరాబాద్ కు చెందిన బాధితురాలు గతంలో తాను రూ.3.16 కోట్లు నష్టపోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు రోనక్ తన్నాగా గుర్తించారు. గోవాలో అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఆన్ లైన్ మోసమంతా దుబాయ్ వేదికగా జరిగినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అతని అకౌంట్ లో రూ.20 లక్షలు ఫ్రీజ్ చేశారు. సహకరించిన మరో ఇద్దరికి నోటీసులిచ్చారు. ఈ కేసులో మరో నిందితుడు 95 బ్యాంకు అకౌంట్లు వినియోగిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. హర్యానాకు చెందిన హితేశ్ గోయల్ మోసాలు చేశాడని గుర్తించి, నిందితున్ని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. అతడి నుంచి రూ.1.4 కోట్లు సీజ్ చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Latest News