విధాత : శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 41.4కోట్ల విలువైన 5.92కిలోల హెరాయిన్ డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ డ్రగ్స్ పట్టుబడటం ఇదే మొదటిసారి. జాంబియా నుంచి వచ్చిన మహిళ బ్యాగ్‌లను తనిఖీలు చేయగా డ్రగ్స్ బయటపడ్డాయి. సౌతాఫ్రికాకు చెందిన మహిళగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం అమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. పట్టుబద్ద డ్రగ్ సీజ్ చేశామన్నారు. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటంతో ఎయిర్ పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు.
ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు
శంషాబాద్ ఎ యిర్ పోర్టుకు ఆదివారం సాయంత్రం ఆగంతకుడు బాంబు పెట్టామని బెదిరింపు కాల్ చేయడం కలకలం రేపింది. జీఎంఆర్ కస్టమర్ కేర్‌కు అగంతకుడకు బెదిరింపు మేసేజ్ పెట్టాడ.. ఆగంతకుడు విదేశాల నుంచి మేసేజ్ చేసినట్లుగా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఒకే రోజు పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడటం..ఇదే రోజు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమై ఎయిర్ పోర్టులో బందోబస్తు, తనిఖీలను పెంచింది.