Site icon vidhaatha

Khazana Jewellery : చందానగర్ జ్యూవెలరీ షాపులో దోపిడీ దొంగల కాల్పులు..చోరీ

breaking-armed-robbery-at-chandanagar-khazana-jewellery-in-hyderabad

Khazana Jewellery | విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ చందనగర్ పరిధిలో ఖజానా జ్యూవెలరీ షాపులో దోపిడీ దొంగలు భీభత్సం సృష్టించారు. ఖజానా జ్యువెలరీ దుకాణంలో దొంగలు దోపిడికి ప్రయత్నించారు. షాపులోని అసిస్టెంట్ మేనేజర్ ను లాకర్ తాళాలు ఇవ్వాలని బెదిరించారు. సిబ్బంది ఎదురుతిరుగడంతో దొండలు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కు బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం తుపాకీ పేల్చి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. లోపల బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ విరగ్గొట్టి వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు.

నగల దుకాణ సిబ్బంది భయంతో పోలీసులకు ఫోన్ చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులను చూసి దుండగులు పారిపోయారు. మొత్తం ఆరుగురు దొంగలు ఈ దోపీడికి పాల్పడ్డారు. నిందితుల కోసం పది బృందాలను ఏర్పాటుచేసి గాలిస్తున్నారు. సీపీ అవినాష్ మహంతి సారధ్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

బంతి పువ్వుపై పడుకున్న ‘పాము’.. చూస్తే మ‌తి పోవాల్సిందే..!

అత్త‌ను 19 ముక్క‌లుగా నరికిన డెంటిస్ట్ అల్లుడు.. కార‌ణం తెలిస్తే షాక్..!

Exit mobile version