Snake sleep on Flower | పాముల పేరు విన్నా.. వాటిని ప్రత్యక్షంగా చూసినా గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఎందుకంటే పాములు( Snakes ) అతి భయంకరమైనవి. విషపూరితమైనవి కూడా. పాములు కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇక కొన్ని పాములు అయితే ఒక చెట్టు మీద నుంచి మరో చెట్టు మీదకు జంప్ చేస్తూ.. భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి.
చెట్ల పొదల్లో, చిత్తడిగా ఉన్న ప్రాంతాల్లో పాములు ఎక్కువగా సంచరిస్తుంటాయి. చాలా పాములు నివాసాల్లోకి ప్రవేశించి.. నిశ్శబ్దంగా కాటేస్తాయి. కొన్ని సార్లు కంటికి కనిపించినా అవి చిక్కకుండా అల్లకల్లోలం సృష్టిస్తాయి.
అయితే ఓ పాము పెరట్లోకి( Garden ) ప్రవేశించింది. ఇక అక్కడున్న బంతి పువ్వు( Marigold ) చెట్టుపైకి ఎక్కింది. ఆ పువ్వు రెక్కలపై చుట్టలు చుట్టుకుని ఎంతో హాయిగా సేద తీరుతుంది. ఫస్ట్ టైమ్ ఆ పువ్వును చూస్తే.. పువ్వే ఆ ఆకారంలో ఉందని అనుకుంటాం. కానీ నిశితంగా పరిశీలిస్తే.. బంతి పువ్వు రేకులపై పాము( Snake sleep on Flower ) చుట్టలు చుట్టుకుని పడుకుందని గమనిస్తాం. ఇప్పుడు బంతి పువ్వుపై పాము పడుకుని ఉన్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఓ మహిళ తన పెరట్లో చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించి సోషల్ మీడియా( Social Media )లో వైరల్ చేసింది. అయితే తల్లి పాము కోసం పిల్ల పాము ఎదురు చూస్తుందని ఆ మహిళతో పాటు పలువురు నెటిజన్లు పేర్కొన్నారు. పాములతో ఆటలొద్దని, దాన్ని స్వేచ్ఛగా బతకనివ్వండని మరోకరు అన్నారు. పిల్ల పాము సన్ బాతింగ్9 Sun Bathing ) చేస్తుందని వ్యంగ్యంగా స్పందించారు. ఇది చాలా భయానకంగా ఉందని మరో నెటిజన్ పేర్కొన్నారు. మరి మీరు ఓ లుక్కేయండి.. బంతి పువ్వుపై హాయిగా సేద తీరుతున్న పాముపై..