Murder | బెంగళూరు : ఓ డెంటిస్ట్అ ల్లుడు( Son In Law ) తన అత్త( Mother in Law ) పట్ల క్రూరమృగంలా ప్రవర్తించాడు. ఆమెను విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 19 ముక్కలుగా నరికి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక( Karnataka )లోని టుమకూరు( Tumakuru )లో చోటు చేసుకుంది.
టుమకూరులోని కొరటాగేరు(Koratagere ) పోలీసు స్టేషన్ పరిధిలోని కొలాల గ్రామ( Kolala village ) సమీపంలో ఈ నెల 7వ తేదీన ఓ ఏడు కవర్లలో మహిళ శరీర భాగాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. కోరటాగేరు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఏడు ప్లాస్టిక్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. అదే ఏరియాలో మహిళ తలను కూడా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
హత్యకు గురైన మహిళను లక్ష్మీదేవి(42)గా పోలీసులు గుర్తించారు. మొత్తం ఆమెను 19 ముక్కలుగా నరికినట్లు నిర్ధారించారు పోలీసులు. ఇక నిందితుడిని గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా ఆమె అల్లుడు రామచంద్రప్ప(డెంటిస్ట్), సతీశ్ కేఎన్, కిరణ్ కేఎస్‌ను అరెస్టు చేశారు. వీరంతా టుమకూరుకు చెందిన వారని గుర్తించారు.
తామే లక్ష్మీదేవిని హత్య చేసినట్లు రామచంద్రప్ప, అతని స్నేహితులు అంగీకరించారు. సాక్ష్యాధారాలు దొరకొద్దనే ఉద్దేశంతోనే ఆమెను 19 ముక్కలుగా నరికి.. వివిధ ప్రాంతాల్లో విసిరేశామని తెలిపారు. లక్ష్మీదేవి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పాటు ఆమె తనకు ఏదైనా హానీ కలిగిస్తనే అనుమానంతోనే హత్య చేసినట్లు రామచంద్రప్ప పేర్కొన్నాడు.