విధాత: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని హౌసింగ్ సొసైటీలో సాయంత్రం నడక కోసం బయలుదేరిన 75 ఏండ్ల వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. సాయంత్రం అందరూ చూస్తుండగానే ఓ వైపు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఆమెను ఎదురుగానే ఢీకొట్టింది.
స్థానికులు ఆమెను హుటాహుటిన దవాఖానకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాద ఘటన స్థానిక సీసీటీవీ ఫుటేజీ రికార్డయింది. దానిని సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.