విధాత: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దారుణం చోటు చేసుకుంది.రెండు నెలల పసి పాపను చంపాడు ఓ తండ్రి. తన బిడ్డ తన పోలికలతో లేదని భార్య చిట్టమ్మతో గొడవ పడేవాడు మల్లిఖార్జున.నిన్న రాత్రి తన బిడ్డను ఎత్తుకెళ్లడంతో చంపేస్తాడేమోనని భయపడి పోలీసులకు ఫిర్యాదు చేసిన చిట్టమ్మ.పాప ఆచూకి కోసం రాత్రి నుంచి గాలించిన పోలీసులు.ఇవాళ ఓ సంచిలో నిర్జీవంగా కనిపించిన శిశువు.పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరి ఆడకుండా పాశవికంగా చంపాడు తండ్రి మల్లిఖార్జున