విధాత: పశ్చిమ ఢిల్లీలోని కీర్తి నగర్‌లో ఉన్న బహుళ అంతస్థుల ఫర్నిచర్ షోరూమ్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో భారీగా ఆస్తినష్టం జరిగింది. 17 అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఢిల్లీలోని బావన ప్రాంతంలోని ఓ పరిశ్రమలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. 26 ఫైరింజన్లతో వచ్చిమంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ఈ రెండు ఘటనల్లో ఎలాంటి ప్రాణానష్టం జరుగలేదని పోలీసులు వెల్లడించారు.