విధాత,కామారెడ్డి: జిల్లాలోని బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామ శివారులోని మంజీరా నదిలో నలుగురు గల్లంతయ్యారు. అందులో తల్లి, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. ముగ్గురి మృతదేహాలు లభ్యమవగా… అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మంజీరా నది సమీపంలో దైవ దర్శనానికి ఓ కుటుంబం రాగా…అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది.