Site icon vidhaatha

Varanasi Gang Rape: వారణాసిలో దారుణం..యువతిపై 23మంది లైంగిక దాడి

విధాత: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిని కిడ్నాప్ చేసి, వారం రోజుల వ్యవధిలో 23 మంది లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరిలో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మిగతా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. వారణాసి లాల్ పూర్ కు చెందిన 19 ఏళ్ల యువతి మార్చి 29వ తేదీన స్నేహితురాలిని కలిసేందుకని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి యువతి ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబసభ్యులు ఏప్రిల్ 4వ తేదీన ఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అదే రోజు పోలీసులు పాండేపూర్ వద్ద డ్రగ్స్ మత్తులో ఉన్న ఆమెను కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు. అనంతరం ఆమెను ఫ్రెండ్ ఇంటి వద్ద వదిలి వెళ్లారు. ఆ తర్వాత సొంతింటికి చేరుకుని తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని తండ్రికి తెలిపింది. ఈ నెల 6న తండ్రితో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్థానిక హుక్కా సెంటర్, ఒక హోటల్, ఒక లాడ్జి, ఒక గెస్ట్ హౌస్ లో తనపై మొత్తం 23 మంది అత్యాచారానికి ఒడిగట్టినట్లు అందులో ఆరోపించింది. మత్తు మంది ఇచ్చి పలు హోటళ్లు, హుక్కా బార్లకు తిప్పుతూ అత్యాచారం చేసినట్లుగా వెల్లడించింది.

దీంతో పోలీసులు 22మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వారిలో ఆరుగురిని అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు మైనర్లు ఉన్నందునా పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించడం లేదు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని డీసీపీ చంద్రకాంత్ మీనా తెలిపారు. నిందితులో 12మందిని గుర్తించగా..మరో 11మందిని గుర్తించాల్సి ఉందని వెల్లడించారు.

Exit mobile version