ట్రక్కు-కారు ఢీ.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం..!

  • Publish Date - October 15, 2023 / 06:57 AM IST

విధాత‌: తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా చెంగాం జిల్లాలో ఆదివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నది. ట్రక్కు – కారు ఢీకొట్టుకున్న సంఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారు. చెంగాం సమీపంలోని బైపాస్‌లో బెంగళూరు నుంచి కారు వస్తోంది. అదే సమయంలో ఎదురుగా తిరువణ్ణామలై వైపు ఓ లారీ వస్తోంది.


ఈ క్రమంలోనే కారు-ట్రక్కుడు ఢీకొట్టుకున్నాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి.. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి.. సహాయక చర్యలు చేపట్టారు. అయితే, మృతులను కర్నాటకకు చెందిన వారిగా కారు రిజిస్ట్రేషన్‌ను బట్టి గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.