త‌మిళ‌నాడులో ఇద్ద‌రు రౌడీషీట‌ర్ల ఎన్‌కౌంట‌ర్‌

  • Publish Date - October 12, 2023 / 10:21 AM IST
  • ఢిల్లీలో అరెస్టు చేసి చెన్నైకి తీసుకొస్తుండ‌గా
  • త‌ప్పించుకొనేందుకు పోలీసుల‌పై నిందితుల దాడి
  • అడ్డుకునేందుకు జ‌రిపిన కాల్పుల్లో ఇద్ద‌రు హ‌తం


విధాత‌: పోలీసుల ఎన్‌కౌంట‌ర్‌లో ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని తిరువ‌ళ్లూరులో గురువారం చోటుచేసుకున్న‌ది. మృతుల‌ను ముత్తు శ‌ర‌వ‌ణ‌న్‌, స‌తీశ్‌గా గుర్తించారు. చోల‌వ‌రం ప్రాంతంలో ఈ ఇద్ద‌రు రౌడీ షీట‌ర్లు పోలీసుల తుపాకులు లాక్కుకొని వారికి దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. నిందితును అడ్డుకొనేందుకు పోలీసులు జ‌రిపిన ఎదురు కాల్ప‌ల్లో ఇద్ద‌రు చ‌నిపోయిన‌ట్టు పోలీస్ అధికారులు వెల్ల‌డించారు.


లీసుల వివ‌రాల ప్ర‌కారం.. ఏఐఏడీఎంకే నాయ‌కుడి హ‌త్య కేసులో రౌడీషీట‌ర్లు అయిన ముత్తు శ‌ర‌వ‌ణ‌న్‌, స‌తీశ్‌ను ఢిల్లీలో అరెస్టు చేసిన‌ట్టు పోలీస్ అధికారులు తెలిపారు. వారిని చెన్నైకి తీసుకొస్తుండ‌గా, తిరువ‌ళ్లూరు జిల్లా మేరంబేడు గ్రామం స‌మీపంలో పోలీసుల క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకొనేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్ప‌డ్డార‌ని రౌడీషీట‌ర్ల‌ను అడ్డుకొనే క్ర‌మంలో జ‌రిపిన కాల్పుల్లో నిందితులు ఇద్ద‌రూ చ‌నిపోయార‌ని పేర్కొన్నారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.