విధాత:మైనర్ బాలికను వేధించిన కేసులో మహేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు తాడేపల్లి పోలీసులు
సీఐ శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు మహేంద్ర ప్రతిరోజు బాలికను వెంబడించి వేధించి అసభ్యకరంగా ప్రవర్తించే వాడని అతని వేధింపులు కారణంగానే మైనర్ బాలిక గడ్డి మందు తాగి ఆత్మహత్య యత్నంకు పాల్పడిందని,గత పదిరోజులుగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆమే పరిస్థితి విషమంగా వుందని తెలియజేశారు.
నిందితుడు మహేంద్రను రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ శేషగిరిరావు హెచ్చరించారు.