Zodiac Signs | జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మంగళుడి( Mars ) సంచారం 45 రోజుల్లో జరుగుతుంది. అయితే కుంభ రాశి (Aquarius)లో ప్రస్తుతం రాహువు సంచరిస్తున్నాడు. ఈ సమయంలో కుంభ రాశిలో ఉన్న రాహువుతో మంగళుడు కలవడం మూలంగా అంగారక యోగం( Angarak Yog ) ఏర్పడింది. ఈ రెండు ఒకదానికొకటి శత్రు గ్రహాలు. కాబట్టి మంగళుడు, రాహువు( Rahuvu ) కలవడం జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రమాదకరంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో ఈ మూడు రాశుల( Zodiac Signs ) వారు డిసెంబర్ 7వ తేదీ వరకు జాగ్రత్తగా ఉండాలని పండితులు హెచ్చరిస్తున్నారు.
కర్కాటక రాశి (Cancer)
కుజుడు కర్కాటక రాశి నుంచి ఐదవ స్థానంలో ఉండి మీ రాశిని ఎనిమిదవ స్థానంలో చూస్తున్నాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు ధన నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ రాశివారు తమ మాటతీరును నియంత్రణలో ఉండేలా చూసుకుంటే బెటర్.
మకర రాశి (Capricorn)
అంగారక యోగం కారణంగా మకర రాశి వారికి కూడా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వృశ్చిక రాశిలో సంచరిస్తున్న మంగళుడు మీ 11వ స్థానంలో ఉండి నాల్గవ స్థానంపై దృష్టి సారిస్తున్నాడు కాబట్టి. ఈ క్రమంలో చేపట్టిన పనులు చెడిపోయే ప్రమాదం ఉంది.
కుంభ రాశి (Aquarius)
అంగారక యోగం కుంభ రాశి వారికి కూడా సమస్యలను సృష్టిస్తుంది. వాగ్వాదాల మూలంగా సంబంధాలలో దూరం ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.
