Marriage | వయసొచ్చాక కూడా పెళ్లి( Marriage ) కాకపోతే చాలా నిరుత్సాహం చెందుతుంటారు. తన జాతకం బాగాలేదనో.. దోషాలు ఏమైనా ఉన్నాయో అని ఆలోచిస్తుంటారు. అనేక రకాల పూజలు( Pooja ) చేస్తూ.. దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తుంటారు. అయినా కూడా వారికి వివాహం కల నెరవేరదు. కానీ ఏండ్ల తరబడి వివాహ ప్రయత్నాలు చేసినా పెళ్లి కానివారు ఈ నాలుగు మొక్కలు( Plants ) ఇంటి ఆవరణలో పెంచాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. ఈ నాలుగు మొక్కలు పెంచిన తర్వాత కచ్చితంగా పెళ్లి పీటలెక్కుతారని పండితులు చెబుతున్నారు. మరి ఆ నాలుగు మొక్కలు ఏవో ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందాం.
తులసి మొక్క ( Tulasi Plant )
ప్రతి హిందువు కూడా తులసి మొక్కను ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. తమ ఇంటి ముందు తులసిని పెంచుకుంటూ.. వారానికోసారి పూజలు చేస్తుంటారు. ఈ మొక్కను పెంచుకోవడం కారణంగా ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. దీంతో ఆ ఇంట్లో ఎవరైనా పెళ్లి కాని వారు ఉంటే కచ్చితంగా పెళ్లి అవుతుందని నమ్మకం. అంతేకాకుండా వైవాహిక జీవితంలో అడ్డంకులు తొలగిపోయి వివాహానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. పండితుల అభిప్రాయం ప్రకారం, ఈ తులసి మొక్కను మీ ఇంటి తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది.
బంతి పువ్వు ( Mari Gold )
బంతి చెట్లను ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలోని పెరట్లో పెంచుకుంటారు. ఏ శుభకార్యానికైనా ఈ బంతి పూలను విరివిగా వినియోగిస్తారు. ఈ పువ్వులు ప్రశాంతతను ఇస్తాయి. ప్రశాంతకు మారుపేరు అయినా ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచుకుంటే.. అడ్డంకులు తొలగిపోయి.. పెళ్లికి మార్గం సుగమం అవుతుంది. ఈ మొక్క ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది. మనశ్శాంతిని తెస్తుంది. స్వచ్ఛత, శాంతి సమతుల్యతకు సంబంధించిన ఈ బంతి పువ్వు మొక్కను మీ ఇంటి తూర్పు వైపున ఉంచడం, నిర్వహించడం మంచిది. ఒక్క వివాహ జీవితానికే కాదు ప్రేమ జీవితంలో సమస్యలను కూడా తొలగిస్తుందని పండితులు చెబుతున్నారు.
మల్లె మొక్క ( Jasmine )
మల్లె మొక్కను ఇష్టపడని వారంటూ ఎవరూ ఉండరు. ఈ మొక్కను పెంచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడుతుంటారు. ఈ మొక్కను పెరట్లో పెంచుకోవడం వల్ల.. సానుకూల శక్తి పెరిగి జీవితంలో ఎదుగుదలకు సహాయపడుతుంది. పెళ్లి సంబంధాలకు సానుకూల శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఇది వివాహానికి అడ్డంకులను తొలగించడమే కాకుండా, ప్రేమ జీవితంలోని సమస్యలను, కోపాన్ని కూడా తొలగిస్తుంది. ప్రేమ విషయంలో తల్లిదండ్రుల అనుమతి కోసం వేచి ఉన్నవారు తమ ఇంట్లో మల్లె మొక్కను ఉంచుకుని దానిని సరిగ్గా పెంచాలని పండితులు సూచిస్తున్నారు.
అరటి చెట్టు( Banana Plant )
వివాహంలో అడ్డంకులను తొలగించడానికి, వివాహానంతర సమస్యలను పరిష్కరించడానికి చేసే ఆచారాలలో అరటి చెట్టు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. హిందూ మతంలో అరటి చెట్టును పవిత్ర వృక్షంగా భావిస్తారు. ఇది ఇంటికి సానుకూల శక్తిని తెచ్చే చెట్టుగా కూడా పరిగణించబడుతుంది. మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి , ఇంట్లో అరటి చెట్టును పెంచండి. ప్రతి గురువారం, నెయ్యి దీపం వెలిగించి చెట్టును పూజించండి, మీ వైవాహిక జీవితంలోని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వివాహానికి ఆటంకాలు కలిగించే ప్రధాన దోషాలలో ఒకటైన కుజ దోషం ఉన్నవారు ఈ పరిహారాన్ని కొనసాగించవచ్చు.
