విధాత : చత్తీస్ గఢ్ గడ్చిరోలి అటవీ ప్రాంతం మరోసారి మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులతో దద్దరిల్లింది. ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోగా, భద్రత బలగాలకు చెందిన కమెండ్ దీపక్ మృతి చెందారు. మరో జవాన్ కు గాయలవ్వగా ఆసుపత్రికి తరలించారు.
ఘటన స్థలంలో ఒక ఏకే 47, ఒక ఎస్ఎల్ఆర్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు గాలింపు ముమ్మరం చేశాయి. నిన్న బీజాపూర్ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఉదమ్ సింగ్ సహా మరొకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి చేపట్టిన ఆపరేషన్ కగార్ గడువు మార్చి 31తో ముగియ్యనున్న నేపథ్యంలో భద్రతబలగాలు మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లను ముమ్మరం చేశాయి.
