Site icon vidhaatha

రికార్డు సృష్టించిన బాలాపూర్ లడ్డు

హైదరాబాదులోని బాలాపూర్‌ గణనాథుని లడ్డూ మరోసారి రికార్డు ధర పలికింది. లడ్డూను వేలంలో రూ. 24.64 లక్షల ధరకు బాలాపూర్ గ్రామ వాసి TRS నాయకుడు వంగేటి లక్ష్మారెడ్డి సొంతం చేసుకున్నాడు. గత ఏడాది బాలాపూర్ లడ్డు రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ ఈ సారి 5లక్షలు అధికంగా ధర పలికింది.

బాలాపూర్‌ ప్రధాన కూడలిలో జరిగిన వేలంపాట కార్యక్రమానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి హాజరయ్యారు.

1994 నుంచి బాలాపూర్‌లో గణేశ్ లడ్డూ వేలంపాట కొనసాగుతోంది. మొదట 450తో ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలంపాట.. 2021లో రికార్డు స్థాయికి చేరి 18.90 లక్షలు పలికింది. తాజాగా దాన్ని అధిగమించింది.

Exit mobile version