Brahma Kamalam | సాధారణంగా బ్రహ్మ కమలం( Brahma Kamalam ) ఏడాదికి ఒకట్రెండు సార్లు మాత్రమే పూస్తుంది. అది కూడా ఒక చెట్టుకు ఒకట్రెండు పూలు( Flowers ) మాత్రమే పూస్తాయి. ఇలా బ్రహ్మ కమలాలు పూస్తే గొప్పగా భావిస్తారు. కానీ మన హైదరాబాద్( Hyderabad )లోని ఓ ఇంటి ఆవరణలో ఉన్న ఒకే చెట్టుకు 24 బ్రహ్మ కమలాలు( Brahma Kamalam Flowers ) పూశాయి. అయితే ఈ పువ్వులు ప్రతి ఏడాది జూన్ నెలలోనే పూస్తాయి. కానీ వాతావరణ మార్పుల కారణంగా కొంచెం ఆలస్యంగా ఆగస్టు మాసంలో పూస్తున్నాయి.
హైదరాబాద్ సాలార్‌జంగ్ కాలనీ( Salarjung Colony )లో ఒక ఇంటి ఆవరణలో ఉన్న బ్రహ్మకమలం చెట్టుకు 24 బ్రహ్మకమలాలు పూశాయి. ఈ అద్భుత దృశ్యం 17వ తేదీ రాత్రి ఆవిష్కృతమైంది. ఒకేసారి 24 బ్రహ్మకమలాలు పూయడంతో ఆ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆ పువ్వులను తాకుతూ తన్మయత్వం చెందారు. ఇరుగుపొరుగు వారు కూడా బ్రహ్మకమలాలను చూసి మురిసిపోయారు. సెల్ఫీలతో సందడి చేశారు.
బ్రహ్మ కమలం శివునికి అత్యంత ప్రీతికరమైనది భక్తుల విశ్వాసం. హిమాలయాల్లో దొరికే ఈ మొక్క ఇంట్లో ఉంటే మంచిదని అందరూ భావిస్తారు. కొన్ని గంటలు మాత్రమే వికసించే ఈ అందమైన పుష్పాన్ని చూసేందుకు జనాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ కొన్ని మొక్కలకు మాత్రమే ఇలా భారీ పుష్పాలు వికసిస్తాయని అంటున్నారు.