Site icon vidhaatha

04.07.2024 గురువారం రాశిఫ‌లాలు.. మీ రాశిఫ‌లం ఎలా ఉందంటే..?

మేషం

మేషరాశి వారికి ఈ రోజు అదృష్టదాయకంగా ఉంటుంది. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పలు మార్గాల ద్వారా ధనాదాయం ఉంటుంది. భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. వ్యాపారులు ఈ రోజు వ్యాపార రంగంలో తమకంటూ కొత్త మైలురాయి సృష్టించుకుంటారు.

వృషభం

వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. క్లిష్టమైన పరిస్థితులను మీకు అనుగుణంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రతికూల ఆలోచనలు వీడండి.

మిథునం

మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల వారికి ఆశించిన ఫలితాలు ఉండవచ్చు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి అవరోధాలు ఏర్పడతాయి. సమయానుకూలంగా నడుచుకుంటే మంచిది. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఉంటాయి.

కర్కాటకం

కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. కీలక వ్యవహారాల్లో సర్డుబాటు ధోరణితో ఉంటే త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు.

సింహం

సింహరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఆర్ధికంగా ఆశించిన ప్రయోజనాలు ఉండక నిరాశకు గురవుతారు. మీరంటే గిట్టని వారి నుంచి వృత్తి పరంగా ప్రమాదం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపిస్తుంది. ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటుంది.

కన్య

కన్యారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఇన్ని రోజుల మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకోనున్నారు. అన్ని రంగాల వారిని అదృష్టం వరిస్తుంది. వ్యాపారులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. బంధు మిత్రుల నుంచి లబ్ది పొందుతారు.

తుల

తులారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన వివాదాలను కోర్టు బయట పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలకు ముగింపు లభించవచ్చు. పలు మార్గాల ద్వారా ధనాదాయం వృద్ధి చెందుతుంది.

వృశ్చికం

వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులన్నీ ఒకేసారి రావడంతో హడావుడిగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళతారు. వ్యాపారులకు ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్ధికంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఉద్యోగం కూడా ప్రమాదంలో పడే పరిస్థితి రావచ్చు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండండి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. పని పట్ల ఏకాగ్రత అవసరం. నైపుణ్యాలు మెరుగు పరచుకుంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. సందర్భానుసారం నడుచుకుంటే మంచిది.

కుంభం

కుంభరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులు, వృత్తినిపుణులకు లాభదాయకమైన రోజు. మంచి లాభాలతో పాటు పదోన్నతి పొందే సూచనలు కూడా ఉన్నాయి. చేపట్టిన పనులలో విజయం చేకూరుతుంది.

మీనం

మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి పనిభారం పెరుగుతుంది. తీవ్రమైన ఒత్తిడితో ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

Exit mobile version