Narmetta Oil Plam Factory : సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద ఉద్రిక్తత

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Narmetta Oil Plam Factory

విధాత, హైదరాబాద్ : బసిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ పామ్ పరిశ్రమ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ వాతావరణంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయిల్ పామ్ ఫ్యాక్టరీని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్ రావు, బీజేపీ ఎంపీ రఘునందన్ రావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలకు దిగారు. హరీశ్ రావు డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు, మంత్రులు డౌన్ డౌన్, హరీశ్ రావు జిందాబాద్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలతో హోరెత్తించి ఒకరిపై ఒకరు దూసుకెళ్లారు.

దీంతో రెండు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొనడంతో పోలీసులు వారిని అడ్డగించారు. వేదికపై నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలకు హరీష్ రావు, కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం నచ్చజెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం హాజరైన నాయకులు ప్రసంగిస్తూ రైతులకు అయిల్ పామ్ సాగుతో ఒనగూరే ప్రయోజనాలను ఏకరువు పెట్టారు.

ఇవి కూడా చదవండి :

Nellore : కూల్ డ్రింక్స్ లారీ బోల్తా…10నిమిషాల్లో ఖాళీ చేసిన జనం
Heavy Rains Alert : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్ష సూచన

Latest News