విధాత, హైదరాబాదా్ : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ పిడుగులతో కూడిన భారీ వర్ష సూచన చేసింది. రాబోయే కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల జిల్లాలలో ఈదురుగాలులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతాయని తెలిపింది. అల్లూరి, కాకినాడ, ఏలూరు, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రఖర్ జైన్ తెలిపారు.
తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో భారీ వర్షాలు, మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా తెలంగాణకు 3 రోజులు వర్షసూచన చేసింది. 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అవకాశం ఉందని, పిడుగులు, వడగళ్లు పడవచ్చని పేర్కొంది.
ఇప్పటికే ఏపీలో పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంతో ఐదుగురు చనిపోయారు. గాలివాన ధాటికి పంటలు నేల పడిపోగా, కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయ్యాయి. మామిడి, అరటి, కొబ్బరి, సపోటా వంటి తోటలలో కాత రాలిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం నియోజకవర్గాల్లో పంట నష్టం అధికంగా ఉంది. ఇటు తెలంగాణలో సైతం తాజా వర్షాలతో యాసంగి వరి ధాన్యంతో పాటు తోటలు దెబ్బతింటుండటం ఆందోళనకరంగా మారింది.
ఇవి కూడా చదవండి :
గుండెపోటు మృతుల్లో యువతరమే అధికం..కోవిడ్ టీకా ఎఫెక్టేనా?
Fake Paneer: హైదరాబాద్‌లో పన్నీరు కొంటున్నారా.. అయితే జాగ్రత్త
