Site icon vidhaatha

జులై 30 మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి వివాహం నిశ్చ‌యం..!

horoscope-

మేషం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈ రోజు కాస్త పట్టు విడుపు ధోరణి పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోపం అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడాలి. ఖర్చులు తగ్గించుకొని పొదుపు చేయడంపై దృష్టి సారించాలి. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృషభం

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా అభివృద్ధి, ఆర్థికంగా విశేష ధన లాభం చేకూరే అవకాశాలున్నాయి. ఉద్యోగులు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వినోద కార్యకలాపాలకు అధికంగా డబ్బు ఖర్చు చేస్తారు. శుభ వార్తలు అందుకుంటారు.

మిథునం

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. గ్రహసంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి అన్ని రంగాల వారు ఈ రోజు చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉండాలి. కోపం అదుపులో ఉంచుకుంటూ మాట్లాడాలి. లేదంటే వివాదాలు, అపార్థాలు రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు.

కర్కాటకం

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. సానుకూల దృక్పధంతో ముందుకెళ్తే చేసే ప్రతిలోనూ విజయం ఉంటుంది. ఉద్యోగులకు అనుకోకుండా, ఆర్థిక లబ్ధి, ఆదాయ మార్గాల అభివృద్ధి జరుగుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది.

సింహం

సింహ రాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో, సానుకూల ఆలోచనలలో మీరు చేసే ప్రతి పని విజయవంతమవుతుంది. తండ్రితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. భూమి, ఆస్తి కొనుగోలుకు అనుకూలమైన రోజు. ఆర్ధిక విషయాల్లో విశేష శుభ ఫలితాలుంటాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

కన్య

కన్యా రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తీవ్రమైన పని ఒత్తిడి వల్ల అలసట, బద్ధకంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ వ్యతిరేక పరిస్థితులే ఎదురైనట్టు ఉంటాయి. వ్యాపారంలో ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రత్యర్థులుపై విజయం కోసం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

తుల

ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. గ్రహ సంచారం అనుకూలంగా లేదు కాబట్టి ఈ రోజు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. ఎవరితోనూ వాదనల్లోకి దిగవద్దు. లేకుంటే అందరితో వివాదాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యల కారణంగా చికాకుతో ఉంటారు. కోపం అదుపులో ఉంచుకోవాలి. అనుకోకుండా ఆర్థిక లాభం ఉంటుంది.

వృశ్చికం

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని పనులు సకాలంలో పూర్తి కావడం వల్ల ఈ రోజు సరదాగా, సంతోషంగా ఉంటారు. ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగులకు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో పట్టిందల్లా బంగారం అవుతుంది.

ధనుస్సు

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం, అదృష్టం ఇలా అన్నీ ఒకేసారి కలిసివస్తాయి. కుటుంబంలో సమన్వయ ధోరణితో కలిసి మెలిసి ఉంటారు. అన్ని పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభం ఉండవచ్చు.

మకరం

మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా లేదు. ఏ పని మొదలు పెట్టినా ఆటంకాలు, అవాంతరాలు ఎదుర‌వుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధమైన చికాకులు. ముఖ్యమైన వ్యవహారాల్లో నిర్ణయాత్మక శక్తి లోపిస్తుంది. ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తే సీనియర్ల మెప్పు పొందే అవకాశం ఉంది. తోటివారితోనూ వాదనల్లోకి దిగవద్దు.

కుంభం

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించండి. పరిణితితో వ్యవహరిస్తే మంచిది. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం

మీన రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారు ఈ రోజు కీలక వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే లాభిస్తాయి. మీ దృఢ నిశ్చయం, మీ విజయ పథాన్ని నిర్థారిస్తాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.

Exit mobile version