Site icon vidhaatha

Vastu Tips For Broom | ‘చీపురుక‌ట్ట‌’ను ‘చీప్‌’గా చూడ‌కండి..! ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..!!

Vastu Tips For Broom | చీపురుక‌ట్ట‌( Broom ).. ఏ ఇంట్లో చూసినా ఓ మూల‌కు క‌నిపిస్తుంది. ఇక ఆ చీపురుతో ఉద‌యం, మ‌ధ్యాహ్నం, సాయంత్రం వేళ ఇంటిని( House ) శుభ్రంగా ఊడ్చుకుంటారు. ఆ త‌ర్వాత చీపురును ఇంట్లోని ఓ మూల‌న పెట్టేస్తుంటారు. ఇంటిని శుభ్రం చేసే చీపురుక‌ట్ట‌ను అంద‌రూ ల‌క్ష్మీదేవి( Lakshmi Devi ) స్వ‌రూపంగా భావిస్తారు. అలాంటి చీపురుక‌ట్ట‌ను చీప్‌గా, నిర్ల‌క్ష్యంగా చూడ‌కూడ‌దు. చీపురును ఎంతో ప‌విత్రంగా భావించాలి. చీపురుక‌ట్ట విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసుకుందాం.

చీపురుక‌ట్ట విష‌యంలో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..

1. సాక్షాత్తు ల‌క్ష్మీదేవి స్వ‌రూపంగా భావించే చీపురుక‌ట్ట‌ను శ‌ని, మంగ‌ళ‌వారాల్లో కొనుగోలు చేయ‌కూడ‌దు. ఈ పొరపాటు చేయడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

2. పాత చీపురును బ‌య‌ట ప‌డేయొద్దు. సరైన సమయం, మంచి రోజూ చూసి దాన్ని బయిట వేయాలి. పాడైపోయిన చీపుర్లు ఇంట్లో ఉండడం మంచిది కాదు. ఇవి లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని కలిగిస్తాయని చాలా మంది నమ్ముతారు.

3. చీపురుని కొనుగోలు చేయడానికి బుధవారం లేదా గురువారం, శుక్రవారం అనుకూలమైన రోజులు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.

4. చీపురుక‌ట్ట‌తో ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా చేయ‌డంతో.. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది.

5. చీపురుకట్టను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. ముఖ్యంగా చీపురుకట్టను డబ్బులు, నగలు పెట్టే స్థలాలలో అస్సలు పెట్టకూడదు. అంతేకాదు వంటగదికి కూడా చీపురు దూరంగా ఉంచాలి. చీపురుని తొక్కొద్దుచీపురుని కాళ్లతో తొక్కడం వంటివి చేయకూడదు. అలా చేస్తే కూడా లక్ష్మీదేవికి కోపం వస్తుందని చాలా మంది నమ్ముతారు.

Exit mobile version