DhanaLaxmi Pooja | మానవ సమాజంలో మనుగడ సాధించాలంటే డబ్బుతో పరుగెత్తాలి. కానీ అసలు డబ్బే లేకపోతే ఎలా పరుగెత్తగలం. జీవితం ఒక దశలోనే ఆగిపోతోంది. మరి డబ్బు సంపాదించాలంటే ఏం చేయాలి..? నిరంతరం చెమటోడ్చాలి. అప్పుడే కాస్తోకూస్తో ధనం కూడబెడుతాం. కష్టంతో పాటు కొన్ని పరిహారాలు చేస్తే కూడా ధనలక్ష్మి కటాక్షం( DhanaLaxmi Pooja )కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ధనలక్ష్మి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం( Friday ) సాయంత్రం.. లక్ష్మీదేవిని( Lakshmi Devi ) పూజించాలని సూచిస్తున్నారు. లక్ష్మీదేవిని పూజించడంతో పాటు కొన్ని పరిహారాలు చేయాలని చెబుతున్నారు. మరి ఆ పరిహారాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ధనలక్ష్మి కటాక్షం కోసం చేయాల్సిన పరిహారాలు ఇవే..
- జీవితంలో కోట్లు సంపాదించాలంటే.. శ్రీమంతులు కావాలన్నా.. ప్రతి శుక్రవారం శ్రీసూక్తాన్ని పఠించాలి.
- ధనలక్ష్మీ కటాక్షం పొందడానికి ప్రతి శుక్రవారం సుమంగళి పూజ చేయడం మంచిది. ఒక ముత్తైదువును సాయంత్రం దైవారాధన సమయంలో ఇంటికి ఆహ్వానించి ఆతిధ్యం ఇచ్చి, దక్షిణ తాంబూలాలతో గౌరవించడం ద్వారా ధనలక్ష్మి కటాక్షం కలిగి ఐశ్వర్యం కలుగుతుంది.
- హిందూ సంప్రదాయంలో సముద్ర ఉప్పును లక్ష్మీదేవి స్థానంగా చెబుతారు. సుఖ సంపదలతో ఉండటానికి ఇల్లు తుడిచే నీటిలో సముద్రపు రాళ్ల ఉప్పు కొంత వేసి ఇంటిని శుభ్రం చేయడం వలన అలక్ష్మి తొలగిపోతుందని విశ్వాసం. అంతేకాదు రాళ్ల ఉప్పుకు ప్రతికూల శక్తులను తొలగించి ఇంట్లో శాంతిని స్థాపించే శక్తి ఉంటుంది.
- ధనలక్ష్మీ కటాక్షం కొరకు ముందుగా ఇంట్లోని ప్రతికూల శక్తులను పారద్రోలాలి. ఇంటి ప్రధాన ద్వారం పైన గుమ్మడికాయ ఉంచడం, కనుదృష్టి గణపతి ఫోటోను ఉంచడం వలన ప్రతికూల శక్తులు తొలగి సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. సానుకూల శక్తులు ఉన్నచోటనే లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది.
- ధనలక్ష్మీ కటాక్షం కొరకు వంటింట్లో ఉప్పుని ఒక గాజు పాత్రలో కానీ, జాడీలో కానీ ఉంచి, ఆ పాత్రను ఎప్పుడూ మూసి ఉంచేలా జాగ్రత్త వహించాలి. ఉప్పును మూసి ఉంచడం వలన సంపదలు పెరుగుతాయి.
- ధనలక్ష్మీ కటాక్షం పొందడానికి తరచుగా దాన ధర్మాలు చేయడం మంచిది. దానం చేయడం ద్వారా సానుకూల శక్తుల ప్రభావం పెరుగుతుంది. విద్యాదానం, వస్త్రదానం, జలదానం ఇలా మన శక్తికొద్దీ మంచి మనసుతో చేసే చిన్నపాటి దానమైనా సరే లక్ష్మి కటాక్షాన్ని అందిస్తుంది. అయితే ఒకసారి దానం చేసాక ఇక ఆ విషయం మర్చిపోవాలి. దాని గురించి నలుగురిలో గొప్పలు చెప్పుకుంటే దానం చేసిన ఫలం దక్కదు.
