భారతీయ పెళ్లి వేడుకకు పోలాండ్ మహిళ ఫిదా..!

కేరళకు చెందిన యువకుడిని సాంప్రదాయ హిందూ పద్ధతిలో వివాహం చేసుకున్న పోలాండ్ యువతి భారతీయ వివాహ సంస్కృతిపై చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Jul 08, 2026, 3:14 pm IST
Read Time: 5 mins
భారతీయ పెళ్లి వేడుకకు పోలాండ్ మహిళ ఫిదా..!

పాశ్చాత్త సంస్క‌ృతుల నుంచి, ఆధునిక యువత జీవనశైలి నుంచి ఎన్ని సవాళ్లు ఎదురవుతున్నా..నేటికి భారతీయ పెళ్లి సాంప్రదాయాలు బలంగా నిలబడుతూ ప్రపంచానికి ఆదర్శనీయంగా విరాజిల్లుతున్నాయి. తరుచూ పలువురు విదేశీయులు భారతీయులను పెళ్లి చేసుకుంటూ…సాంప్రదాయ భారతీయ పెళ్లి వేడుకలతో ఒక్కటవ్వడం చూస్తుంటాం. తాజాగా పోలాండ్‌కు చెందిన ఒక మహిళ.. కేరళకు చెందిన ఓ వ్యక్తి సాంప్రదాయ హిందూ పద్ధతిలో చేసుకున్న వివాహా వేడుక సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ జంట మొదట పోలాండ్‌లో కలుసుకున్నారు, అక్కడ వారి స్నేహం ప్రేమగా మారడంతో ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కాలని నిర్ణయించుకున్నారు. వారు కేరళలో సాంప్రదాయ హిందూ ఆచార సంప్రదాయాలను పాటిస్తూ తమ వివాహాన్ని జరుపుకున్నారు.తమ వివాహా వేడుకపై పోలాండ్ అమ్మాయి ఇన్ స్టాలో ఫోస్టు చేసిన వీడియో వైరల్ అవుతుంది.

పోలాండ్ జాతీయురాలైన నేను ఒక భారతీయ వ్యక్తిని వివాహం చేసుకోబోతున్న ప్రయాణం అద్భుతమైన, భావోద్వేగభరితమైన, మంత్రముగ్ధులను చేసే అనుభవాన్ని అందిస్తుందని తాను ఊహించలేదని తన పోస్టులో రాసుకొచ్చింది. నేను చీర కట్టుకున్న క్షణం నుండే, భారతీయ సంప్రదాయం యొక్క గొప్పతనాన్ని, కుటుంబం అందించే ఆప్యాయతను, నన్ను తమలో ఒకరిగా స్వీకరించిన సంస్కృతిలోని ప్రేమను నేను అనుభవించానని చెప్పుకొచ్చింది. పెళ్లి వేడుకలో డ్రమ్స్ శబ్దాలు(బ్యాండ్ మేళాలు, సన్నాయి రాగాలు, మేళ తాళాలు), మల్లెపూల సువాసన, గుడి గంటల మోత…ఇవన్నీ కూడా నాకే తెలియని ఒక అందమైన కలలా అనిపించాయి అని ఆమె వర్ణించిన తీరు నెటిజన్లు ఆకట్టుకుంది.
మా ప్రపంచాలు ఎంతగానో భిన్నమైనవని, పోలాండ్ యొక్క ప్రశాంతమైన శీతాకాలాలు, కేరళ వర్షాకాలపు సందడి, యూరోపియన్ సంప్రదాయాలు, భారతీయ ఆచారాలు వేర్వేరు అయినప్పటికి…వాటికి ప్రేమ తోడైనప్పుడు ఇవన్నీ ఎంతో సహజంగా ఒక్కటిగా, పరిపూర్ణంగా అనిపిస్తాయని ఆమె పేర్కొంది.

కొన్నిసార్లు ప్రేమ అంటే ఒకరి భాష, ఆహారం, దేవుళ్ళ గురించి కూడా తెలుసుకోవడం… అలాగే ప్రతి భిన్నత్వంలోనూ అందాన్ని వెతుక్కోవడం అని రాసుకొచ్చింది. అంతిమంగా వివాహం అంటే ఇద్దరు వ్యక్తులు ఒకేలా మారిపోవడం కాదు… అది ఇద్దరు వ్యక్తులు కలిసి ఏదో కొత్తదనాన్ని..కొత్త బాధ్యతలను సృష్టించుకోవడంగా ఉందని పేర్కొనడం అందరిని ఆకట్టుకుంది.