Site icon vidhaatha

Yadadri | యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. స్వర్ణగిరి దేవాలయంలోనూ రద్దీ

విధాత, హైదరాబాద్ : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా ఆదివారం సెలవు కావడంతో వేల సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఉచిత దర్శనానికి సుమారు మూడు గంటల పాటు వేచి ఉండాల్సివచ్చింది. ప్రత్యేక దర్శనానికి గంట సమయం పట్టింది.

గుట్ట పైకి వెళ్లే ఉచిత బస్సుల్లో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో చిన్న పిల్లలు మహిళలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటు హైదరాబాద్‌ -భువనగిరి మధ్య దారిలో నూతనంగా నిర్మితమైన స్వర్ణగిరి ఆలయానికి కూడా భక్తుల రద్ధీ పెరిగింది. యాదాద్రికి వెళ్లేదారిలో స్వర్ణగిరి నిర్మితమవ్వడంతో యాదాద్రికి వచ్చివెళ్లే క్రమంలో భక్తులు స్వర్ణగిరిని కూడా దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

Exit mobile version