Site icon vidhaatha

Yadagirigutta | యాదగిరిగుట్టలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు.. లక్ష పుష్పార్చన

విధాత, హైదరాబాద్ : తొలి ఏకాదశి పర్వదినాన్ని తెలంగాణ ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. హరిహర దేవాలయాల్లో అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా తీరం వాడపల్లి, నాగార్జున సాగర్ సహా పలుచోట్ల తొలి ఏకాదళి సందర్భంగా నది స్నానాలు చేసి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అటు గోదావరి తీర ప్రాంత దేవాలయాలు కాళేశ్వరం, భద్రాచలం సహా పలుచోట్లు భక్తుల నది స్నానాలు, ప్రత్యేక పూజలు జోరుగా సాగాయి.

తొలి ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి పెరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని అర్చక బృందం స్వామి అమ్మవార్లకు ఆలయ ముఖ మండపంలో లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు నిత్య కల్యాణోత్సవం, సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తుల రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.

Exit mobile version