విధాత : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహా స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి దర్శనం కోసం తరలివచ్చారు. స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు భారీ క్యూలైన్లలో గంటల కొద్ది వేచివున్నారు.
తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొండపైన ఆలయ ప్రాంగణ పరిసరాలన్ని ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. ధర్మ దర్శనానికి మూడు గంటల సమయం పట్టగా, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతున్నది.