విధాత : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి (Yadagirigutta Sr lakshmi Narasimha Swamy)వారి దేవస్థానంలో వైభవంగా ప్రారంభమైన వార్షిక పవిత్రోత్సవాల్లో (Pavithrotsavam celebration) భాగంగా గురువారం ఉదయం స్వామి వారికి నవకలశ స్నాపనం జరిగింది. యజ్ఞశాలలో ద్వార తోరణ పూజ, కుంభారాధన, చక్రబ్జమండలారాధన నిర్వహించి ప్రత్యేక హోమాలు జరిపారు.
నిత్య లఘు పూర్ణాహుతి అనంతరం గర్భాలయములో మూల స్వామి వర్యులందరికి లఘు పవిత్ర ధారణ నిర్వహించారు. అనంతరం మహా నివేదన తీర్ధ ప్రసాద వితరణ చేశారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు (Annual Pavithrotsavam celebration) గురువారం నుంచి మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. అంతకుముందు దేశ స్వాతంత్ర వేడుకలను దేవస్థానం ఆధ్వర్యంలో వేద పాఠశాల విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈవో భాస్కర్‌రావు జాతీయ పతాకావిష్కరణ చేశారు.