Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆదాయంలో పెరుగుద‌ల‌..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఆత్మవిశ్వాసంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థికాభివృద్ధి కోసం చేసే కృషి ఫలిస్తుంది. ఆస్తులు, సంపదలు వృద్ధి చేసారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ప్రయాణాలు ఫలవంతం అవుతాయి.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. మంచి సమయం నడుస్తోంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోవడంతో ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి. తల్లిదండ్రుల నుంచి శుభవార్త అందుకుంటారు. ఖర్చులు అదుపులో ఉంచుకుంటే మంచిది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ఫలితాల కోసం శ్రమించాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అశాంతి కలిగిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగ్గించుకుంటే మంచిది. కొన్ని అవమానకర పరిస్థితులు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. వైద్యపరమైన ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి, ప్రయాణాలకు ఈ రోజు శుభకరమైన రోజు కాదు. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పరీక్షాకాలం. ఇంటా బయట అలోచించి మాట్లాడడం అవసరం. ఓర్పు, సహనం రక్షిస్తాయి. కుటుంబసభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు నిరంతర కృషితో పోటీ దారులపై విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులకు, స్థానచలనానికి అవకాశాలు ఉన్నాయి. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి మంగళకరమైన రోజు.

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు మంగళకరమైన రోజు. కీలక సమావేశాల్లో, చర్చల్లో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు పదోన్నతులు అందుకుంటారు. ధనధాన్య లాభాలున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఆత్మ విశ్వాసంతో ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ పెరిగినప్పటికీ మెరుగైన ఫలితాలు ఉంటాయి. అధికారులతో ఆచి తూచి నడుచుకోవాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త పడండి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. పలు మార్గాల నుంచి ధనప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో కీలక మెరుపులు చోటు చేసుకుంటాయి. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబజీవితాన్ని సంపూర్ణంగా ఆనందిస్తారు. స్నేహితులతో విహారయాత్రలకు వెళ్తారు. ఆదాయంలో పెరుగుదల ఆనందం కలిగిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో క్రమశిక్షణ సమయపాలన అవసరం. వ్యాపారంలో పురోగతి లోపిస్తుంది. ప్రమాదకరమైన వ్యవహారాలు, సందర్భాలకు దూరంగా ఉండటం మంచిది. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా కొంత సమస్యాత్మకంగా ఉంటుంది.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పట్ల మీ కృషి, పట్టుదల అధికారులను ఆకర్షిస్తుంది. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢ పడుతుంది. అనారోగ్య సమస్యలు చికాకు పెడతాయి.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కొన్ని సంఘటనలు విచారం కలిగిస్తాయి. బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడుతాయి. కోపం అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్య సంబంధమైన విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రతికూల ఆలోచనలు విడిచి పెడితే మంచిది. అనారోగ్యం కారణంగా వైద్య ఖర్చులు పెరగవచ్చు.

Latest News