Horoscope | బుధ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశివారికి బంధువులతో విభేదాలు..!

Horoscope | జ్యోతిష్యం అంటే న‌మ్మ‌కం. మ‌న‌కు అంతా మంచే జ‌ర‌గాల‌ని కోరుకుంటాం.. అందువ‌ల్ల ఈ రోజు మ‌న రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయ‌ని చూసుకునే వారు చాలా మందే ఉంటారు. అలాంటి వారి కోసం నేటి రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. వృత్తి పరంగా ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు, చర్చల్లో పాల్గొంటారు. వ్యాపారులు ప్రభుత్వం నుంచి నూతన ప్రాజెక్టులు అందుకుంటారు. వృత్తి పరమైన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు, ప్రాజెక్టులు అందుకుంటారు. వ్యాపారంలో నిధుల కొరత ఉండదు. కొత్త పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. భవిష్యత్తు కొరకు పొదుపు ప్రణాళిక వేస్తారు. ఉద్యోగులకు విదేశీ యాత్రకు అవకాశం ఉంది.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాలలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మనోబలం కోల్పోవద్దు. ఉద్యోగులు బాధ్యతాయుతంగా పనిచేస్తే సత్ఫలితాలు ఉంటాయి. వివాదాలు, వాదనలకు దూరంగా ఉండండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విఘ్నాలు రాకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ఉద్యోగంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. కీలక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. వృథా ఖర్చులు నివారిస్తే మంచిది.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు బుద్ధిబలంతో అధిగమిస్తారు. కీలక విషయాల్లో శ్రద్ధ లోపించకుండా చూసుకోండి. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు మేలు చేసాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా బలపడుతుంది. కుటుంబంలో శాంతియుతమైన వాతావరణం ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది

కన్య (Virgo)

కన్య రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. బుద్ధిబలంతో ఉద్యోగంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళ్తారు.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వృత్తి పరమైన శుభవార్తలు ఆనందం కలిగిస్తాయి. షేర్ మార్కెట్ పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ యోగాలున్నాయి. కొత్త ప్రాజెక్టులు, వెంచర్స్ మొదలు పెట్టడానికి అనువైన సమయం. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున పట్టిందల్లా బంగారం అవుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. నూతన గృహ వాహన యోగాలున్నాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శ్రేష్టమైన సమయం నడుస్తోంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చిత్తశుద్ధి, ఏకాగ్రతతో లక్ష్యాలను చేరుకుంటారు. ఉద్యోగంలో అధికారయోగం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి కలదు. స్థిరాస్తిలో పెట్టుబడులకు సరైన సమయం. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ రోజు అనుకూలం. మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలూ అన్నీ ఫలిస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు. గృహంలో శాంతి సౌఖ్యాలు నెలకొంటాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు, వ్యాపారంలో లాభాలు వంటి శుభ ఫలితాలు ఆనందం కలిగిస్తాయి. కీలక సమావేశాల్లో మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ వాతావరణం ఆనందదాయకంగా ఉంటుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో తలదూర్చవద్దు. కీలక నిర్ణయాల్లో స్పష్టత అవసరం. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. దుబారా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

Latest News