మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవారి పట్ల జాగ్రత్తగా ఉండండి.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల్లో కీలక పురోగతి ఉంటుంది. మిత్రుల నుంచి ఆర్థికంగా లబ్దిపొందే అవకాశాలున్నాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థికంగా అంత అనుకూలం కాదు. కోపావేశాలు విడిచిపెట్టి సహనంతో ఉంటే మంచిది. వివాదాలకు, ఘర్షణలకు దూరంగా ఉండండి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధనలాభం ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. కుటుంబసభ్యులతో వాదనలకు దూరంగా ఉండండి. కోపావేశాలు తగ్గించుకుని మౌనంగా ఉండండి. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం స్వల్పంగా ఇబ్బంది పెడుతుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు సమర్ధవంతంగా అధిగమిస్తారు. అవసరానికి బంధు మిత్రుల సహకారం అందుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు అందుకుంటారు.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టం వరించి ఐశ్వర్యవంతులు అవుతారు. కోర్టు వ్యవహారాలకు ముగింపు లభిస్తుంది. సాహాసోపేతమైన నిర్ణయాలతో సత్ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ సూచన ఉంది. ఆదాయం పెరుగుతుంది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు చికాకు పెడతాయి. కొన్ని సమస్యలు మీ మానసిక ప్రశాంతతను తగ్గిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలకు అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు, రుణభారం పెరగవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాల కోసం తీవ్రంగా శ్రమించాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారులకు, వృత్తినిపుణులకు లాభదాయకమైన రోజు. మీ ప్రతిభకు ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా మీ అంచనాలకు మించిన ఫలితాలు ఉంటాయి.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. పూర్వీకుల ఆస్తులు కలిసివస్తాయి.