మేషం (Aries)
మేష రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
వృషభం (Taurus)
వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబంలో వేడుకలు జరుగుతాయి. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.
మిథునం (Gemini)
మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. స్నేహితుల ద్వారా ఆర్థిక లబ్ది పొందుతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి.
కర్కాటకం (Cancer)
కర్కాటక రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ఈ రోజు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆర్థికంగా ఆశాజకనమైన రోజు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. సమస్యాత్మక అంశాలకు దూరంగా ఉంటే మంచిది. గృహాలంకరణకు సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి.
సింహం (Leo)
సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోండి. ఉద్యోగ వ్యాపారాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం మధురంగా ఉంటుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప
కన్య (Virgo)
కన్య రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ప్రతికూల పరిస్థితులను సహనంతో ఎదుర్కోడానికి ప్రయత్నించండి. ఉద్యోగ వ్యాపారాల్లో ఆచి తూచి అడుగేయాలి. అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండడం మంచిది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు ఉపయోగపడతాయి. ఒక వార్త విచారం కలిగిస్తుంది.
తుల (Libra)
తులా రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అద్భుతమైన గ్రహబలంతో అన్నింటా ఉన్నతంగా నిలుస్తారు. ఇంటా బయట మీ మాటకు తిరుగుండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలు సాధిస్తారు. పదోన్నతులకు అవకాశం ఉంది. వ్యాపారంలో నిరంతర శ్రమతో లాభాలు పెరుగుతాయి. కాలం అన్నివిధాలా సహకరించడంతో ఏ పని ప్రారంభించినా సులభంగా పూర్తవుతుంది.
వృశ్చికం (Scorpio)
వృశ్చిక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గ్రహసంచారం అంత అనుకూలంగా లేనందున ప్రారంభించిన పనుల్లో పట్టుదల అవసరం. మీ స్వధర్మమే మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. నూతన ఆర్థిక వనరులను ఏర్పాటు చేసుకోవడానికి ఇది మంచి సమయం. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. దైవబలంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమిస్తారు. స్థిరమైన బుద్ధితో తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తాయి. ఆర్థికంగా శ్రమకు తగిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆరోగ్యం క్రమేపీ క్షీణించే అవకాశం వుంది కాబట్టి జాగ్రత్త వహించండి. ముఖ్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది.
మకరం (Capricorn)
మకర రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో శ్రమ, పనిఒత్తిడి పెరుగుతాయి. వ్యాపారంలో నష్టభయం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. కుటుంబ వ్యవహారాల్లో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవడం అవసరం. ఆస్తులు, భూముల వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది.
కుంభం (Aquarius)
కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గత కొంతకాలంగా బాధించిన సమస్యలు తొలగుతాయి. ఉద్యోగ వ్యాపారాల్లో విజయ పరంపరలు కొనసాగుతాయి. కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో మౌనం వహించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
మీనం (Pisces)
మీన రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. అదృష్టయోగం ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో విజయావకాశాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి కార్యసిద్ధి, శత్రుజయం ఉంటాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు.
