మేషం (Aries)
మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. దృఢ సంకల్పంతో పనిచేసి లక్ష్యాన్ని సాధిస్తారు. వృత్తి పరమైన ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోండి. స్వల్పంగా పనిఒత్తిడి పెరిగే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
వృషభం (Taurus)
వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనేక విషయాలు ఒత్తిడికి గురి చేస్తాయి. ఈ రోజు కోర్టు, స్థిరాస్తి వ్యవహారాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది. ప్రతికూల ఆలోచనలు, నిరాశావాదాన్ని వీడితే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
మిథునం (Gemini)
మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి తమ తమ రంగాల్లో సంతృప్తికర ఫలితాలు ఉంటాయి. పెద్దల ఆశీర్వాద బలంతో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ధన ధన్య లాభాలున్నాయి. కుటుంబంలో కొన్ని విచారకరం సంఘటనలు జరుగుతాయి.
కర్కాటకం (Cancer)
కర్కాటకరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు వృత్తి పరంగా ఆశించిన ఫలితాలు రాబట్టడానికి తీవ్రంగా శ్రమించాలి. కుటుంబ సభ్యుల పట్ల క్షమాగుణంతో వ్యవహరిస్తే కలహాలు ఉండవు. కీలక వ్యవహారాలు, ముఖ్యమైన ప్రాజెక్టులు వాయిదా వేస్తే మంచిది.
సింహం (Leo)
సింహరాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనుల్లో శుభ ఫలితాలు రాబట్టుతారు. ఉద్యోగులకు పదోన్నతులు, ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.
కన్య (Virgo)
కన్యారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చు. ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు. పనిభారం, ఒత్తిడి పెరుగుతాయి. కోపావేశాలు అదుపులో ఉంచుకుంటే మంచిది. గొడవలు, వివాదాలకు దూరంగా ఉండండి.
తుల (Libra)
తులారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తికి ఉద్యోగ వ్యాపారాలలో అనుకున్న ఫలితాలు రాబట్టడం కష్టతరంగా ఉంటుంది. మీ కోపావేశాల కారణంగా ఇంటా బయట శత్రువులు పెరుగుతారు. నూతన వ్యాపారాలకు దూరంగా ఉంటే మంచిది. అన్ని వైపుల నుంచి ఒత్తిడితో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
వృశ్చికం (Scorpio)
వృశ్చికరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో, స్వయంకృషితో చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దృఢ నిశ్చయంతో, ఆత్మ విశ్వాసంతో కీలక పనులలో పురోగతి సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వివాదాలకు, కలహాలకు దూరంగా ఉంటే మంచిది.
ధనుస్సు (Sagittarius)
ధనుస్సురాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్లారు. ఉద్యోగులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది.
మకరం (Capricorn)
మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉండక పోవచ్చు. వృత్తి పరమైన చికాకులు అధికంగా ఉంటాయి. కోపం అదుపులో ఉంచుకోండి. ఆదాయం క్షీణించడంతో దిగాలుగా ఉంటారు.
కుంభం (Aquarius)
కుంభరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా, శాంతియుతంగా ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు.
మీనం (Pisces)
మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్ధలతో దిగులు చెందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధిక శ్రమ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఒక సంఘటన విచారం కలిగిస్తుంది.