Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో గురు గ్రహానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే గురుడు( Jupiter ) శుభ స్థానంలో ఉంటే.. అన్ని శుభాలే కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అయితే 2026 ఏడాదిలో ఓ మూడు రాశుల( Zodiac Signs ) వారికి గురు బలం ఎక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. దీంతో ఆ మూడు రాశుల వారు ఏ పని తలపెట్టినా విజయవంతంమవుతుంది. ఏడాదంతా శుభాలే కలుగుతాయి. పట్టిందల్లా బంగారమే కానుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం.
ధనస్సు రాశి ( Sagittarius )
గురు బలం కారణంగా 2026 ఏడాదిలో ధనస్సు రాశి వారి జాతకం అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా విజయవంతం అవుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించే నిరుద్యోగుల కల సాకారం అవుతుంది. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. గతంలో ఆగిపోయిన పనులను కూడా పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మాత్రం అద్భుతమైన విజయాలు వరిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
కుంభ రాశి ( Aquarius )
కుంభ రాశి వారికి కూడా 2026 ఏడాది కలిసి వస్తుంది. గురు బలం వలన వీరి ఆదాయం భారీగా పెరుగుతుంది. కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వారు ఈ సంవత్సరంలో నక్కతోక తొక్కినట్లే. అనుకున్న పనులన్నీ సమయానుగుణంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీన రాశి ( Pisces )
మీన రాశి వారికి కూడా గురు బలం చాలా ఎక్కువగ ఉంటుంది. కాబట్టి వీరికి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. ఖర్చులు తగ్గి, డబ్బు ఆదా చేస్తారు. పెట్టబడులు అనుకూలంగా ఉంటాయి. విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకునేవారు ఈ సంవత్సరంలో వారి కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. మీరు కొత్త వ్యాపారం చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట సానుకూలత పెరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
