Site icon vidhaatha

Horoscope | మంగ‌ళ‌వారం రాశిఫ‌లాలు.. ఈ రాశి ఉద్యోగుల‌కు స్థానచ‌ల‌నం..!

మేషం (Aries)

మేష రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. మీ ప్రతిభతో, తెలివితేటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగాలలో శుభ యోగాలున్నాయి. తారాబలం అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే సత్ఫలితాలు సాధించగలరు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృషభం (Taurus)

వృషభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆస్తి విలువలు పెరుగుతాయి. ఓ శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది. వ్యాపారులు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకోకుండా ధనసంపదలు కలిసి వస్తాయి.

మిథునం (Gemini)

మిథున రాశి వారికి ఈ రోజు ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో నూతన బాధ్యతలు స్వీకరితారు. ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు అధిగమిస్తారు. చేపట్టిన పనుల్లో ఆలస్యం ఉండవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి.

కర్కాటకం (Cancer)

కర్కాటక రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనుల్లో చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. బంధువులతో, సన్నిహితులతో మనస్పర్థలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఎట్టి పరిస్థితుల్లో మనోబలాన్ని కోల్పోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకోవాలి.

సింహం (Leo)

సింహ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు శారీరక శ్రమ, పని ఒత్తిడి పెరుగుతాయి. మనోధైర్యంతో అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబంలో చిన్నపాటి కలహాలు ఉండవచ్చు. మాట పట్టింపులకు పోకుండా సామరస్యంతో ఉంటే మంచిది.

కన్య (Virgo)

కన్యా రాశి వారికి ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది. దూరదేశాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితులతో సరదాగా గడుపుతారు. నూతన వస్తువులు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారంలో లాభాలు వృద్ధి చెందుతాయి. పరువు ప్రతిష్టలు పెరుగుతాయి.

తుల (Libra)

తులా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సహచరుల సహకారంతో అన్ని పనులు సమర్ధవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనుల్లో దీక్ష, ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.

వృశ్చికం (Scorpio)

వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

ధనుస్సు (Sagittarius)

ధనుస్సు రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మధురమైన జ్ఞాపకాలు నెమరు వేసుకుంటారు. ప్రియమైన వారితో విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకరం (Capricorn)

మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు అనుకూలమైన సమయం. పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. ప్రమోషన్ ఛాన్స్ కూడా ఉంది. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు.అన్ని రంగాల వారికి ఆర్థిక లాభాలు ఆనందం కలిగిస్తాయి.

కుంభం (Aquarius)

కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. తలపెట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులతో సమాజంలో హోదా పెరుగుతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. వ్యాపారులకు ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది.

మీనం (Pisces)

మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. మీకన్నా బలవంతులతో పోరు అనర్ధం కలిగిస్తుందని గుర్తుంచుకోండి. ప్రత్యర్థులతోనూ అనవసరమైన తగాదాలు, ఘర్షణలు లేకుండా చూసుకోండి. శాంతి మార్గం అవలంబిస్తే మంచిది. ప్రతికూల ఆలోచనలు విడిచి పెట్టండి.

Exit mobile version